ఆ జట్టులోకి హార్దిక్ పాండ్యా.. ఇద్దరు ప్లేయర్లతో ట్రేడ్ డీల్?

ఆ జట్టులోకి హార్దిక్ పాండ్యా.. ఇద్దరు ప్లేయర్లతో ట్రేడ్ డీల్?

IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027(IPL 2027) ఆరంభానికి ముందే ఐపీఎల్ ట్రేడింగ్ మార్కెట్‌లో ఒక సంచలన వార్త తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ను దక్కించుకోవడానికి పంజాబ్ కింగ్స్ (PBKS) భారీ డీల్ కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. రిక్కీ పాంటింగ్ హెడ్ కోచ్‌గా ఉన్న పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ, హార్దిక్ కోసం తమ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh), వికెట్ కీపర్ విష్ణు వినోద్ (Vishnu Vinod) లను ముంబై ఇండియన్స్‌కు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు 'స్పోర్ట్‌స్టార్' (Sportstar) పేర్కొనింది. 

రిటెన్షన్ డెడ్‌లైన్‌కు ముందే ప్రకటన?:

ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ సీనియర్ యాజమాన్యాల మధ్య ఈ ట్రేడింగ్ చర్చలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. పత్రాల ప్రక్రియ (Documentation) పూర్తవ్వగానే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.  నవంబర్ 17వ తేదీ రిటెన్షన్ డెడ్‌లైన్ (Retention Deadline) కంటే ముందే ఈ భారీ స్వ్యాపింగ్ డీల్‌పై స్పష్టత రానుంది.

అర్ష్‌దీప్ కోసం ముంబై ముందుగా ప్రతిపాదన?:

రిపోర్ట్స్ ప్రకారం, ఈ ట్రేడ్ ప్రతిపాదన మొదట ముంబై ఇండియన్స్ సీనియర్ అధికారుల నుంచే వచ్చిందట. ప్రపంచస్థాయి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేని లోటును తీర్చుకోవడానికి ముంబై అర్ష్‌దీప్ సింగ్‌పై కన్నేయగా.. తమ జట్టుకు మ్యాన్-విన్నర్ ఆల్ రౌండర్, కెప్టెన్సీ ఆప్షన్ కోసం పంజాబ్ కింగ్స్ హార్దిక్ పాండ్యాను తీసుకునేందుకు పంజాబ్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అర్ష్‌దీప్‌తో పాటు కేరళ వికెట్ కీపర్-బ్యాటర్ విష్ణు వినోద్ కూడా ముంబై గూటికి చేరనున్నాడు. ఈ డీల్ గనక ఓకే అయితే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ట్రేడింగ్ డీల్స్‌లో ఒకటిగా నిలిచిపోవడం ఖాయం.